Pawan Kalyan: తేజ్ కొత్త సినిమా లాంచ్‌లో పవన్.. ‘మేనల్లుడా మజాకా

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌కి పవర్ స్టార్ ఆశీస్సులు లభించాయి. సాయి ధరమ్ 14 మూవీని క్లాప్ కొట్టి లాంఛ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘ప్రస్థానం’ ఫేమ్.. దేవ్ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ్ సరసన నివేదా పేతు రాజ్ నటిస్తోంది. హైదరబాద్‌లో అట్టహాసంగా జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై.. తన మేనల్లుడికి విషెష్ అందించగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి హాజరయ్యారు.ఈ చిత్రాన్ని భగవాన్, జె పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వీరు గోపీచంద్‌తో గౌతమ్ నంద చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు.ఆరు ఫ్లాప్‌ల తరువాత వరుసగా రెండు హిట్లు సాధిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ‘చిత్ర లహరి’, ప్రతిరోజు పండగే వంటి వరుస విజయాలను సాధించిన తేజ్.. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశారు సాయి ధరమ్ తేజ్. కాగా ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది.. మేనల్లుడా మజాకా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. తన మామ చిరంజీవిది ‘అల్లుడా మజాకా’ చిత్రం ఉండనే ఉండటంతో ‘మేనల్లుడా మజాకా’ టైటిల్ ఈ మేనల్లుడికి యాప్ట్ అవుతుందని.. పైగా తన చిన మామ పవన్ క్లాప్ కొట్టడంతో మెగా మేనల్లుడు ‘మేనల్లుడా మజాకా’ టైటిల్‌కి ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తోంది.