బంపరాఫర్.. రూ.987కే విమాన టికెట్.. ఇంకా 50 శాతం తగ్గింపు

విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా విమాన టికెట్లపై స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయొచ్చు. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో చాలా మంది విమాన ప్రయాణం చేయడాన్ని తగ్గించేశారు. అందుకే కంపెనీలు ఇలా ఆఫర్లతో ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి.స్పైస్‌జెట్ స్ప్రింగ్ సీజన్ సేల్ ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్‌ను రూ.987కే పొందొచ్చు. అదేసమయంలో అంతర్జాతీయ ప్రయాణానికి టికెట్ ధర రూ.3,699 నుంచి ప్రారంభమౌతోంది. ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మార్చి 15 వరకు ప్రయాణికులు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు.స్ప్రింగ్ సీజన్ సేల్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు 2021 ఫిబ్రవరి 28లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా ఎన్ని సీట్లు అందుబాటులో ఉంచామనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే కంపెనీ మాత్రం ముందుగా సీట్లను బుకింగ్ చేసుకున్న వారికే ఆఫర్ సీట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.