పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోనియాతో భేటీ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా గురువారం ఆయన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను కోమటిరెడ్డి ఆమె దృష్టికి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా కోమటిరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు అంశం కూడా సోనియా వద్ద చర్చకు వచ్చినట్లుగా భేటీ అనంతరం దిల్లీలో కోమటిరెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్నికల సమయంలో తెరాస చేసిన అక్రమాలను తెలిపానన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యకర్తగానే ఉంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. రాష్ట్రంలోని అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని.. పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సోనియాను కోరినట్లు కోమటి రెడ్డి తెలిపారు.